India vs South Africa 2019 : Kohli Speaks About Rohit As Test Opener || Oneindia Telugu

2019-10-01 182

Rohit Sharma did not have an entirely auspicious start to his stint as an opener in the longest format as he was dismissed for a duck in the warm-up clash between Board President’s XI and South Africa. However, Indian captain Virat Kohli has thrown his weight behind the right-hander as he believes the Mumbai-batsman needs to be given space and time to excel in the role.
#indiavssouthafrica
#rohitsharma
#testopeners
#viratkohli
#southafricatourofindia2019

టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అవుతాడా? లేదా అన్నది అప్పుడే చెప్పలేమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా బుధవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు.కోహ్లీ మాట్లాడుతూ "టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ విషయంలో ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం. రోహిత్ విషయానికి వస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం ఓ సరికొత్త స్పాట్‌ని కనుగొనడం లాంటిదే. ఇది రెండు విధాల్లో పనిచేయకపోవచ్చు. ఆటగాడిగా అతడి స్థానంపై స్పష్టత ఉండాలి" అని వెల్లడించాడు